బాబోయ్ ఏంటి రీతూ.. బిగ్ బాస్ హౌస్ లో చంద్రముఖి
on Dec 4, 2025
.webp)
చంద్రముఖిలో "వర్ధిల్లండి వర్ధిల్లండి" అనే సాంగ్ అందరికీ గుర్తుంది కదా. దాంతో పాటు "తోమ్ తోమ్ తోమ్ ..వారాయ్.." సాంగ్ కూడా తెలుసుకు కదా..ఇప్పుడు ఈ పాటే అన్ని చోట్లా వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో చంద్రముఖి రీతూ అంటూ ఒక రీల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ సాంగ్స్ లో అందరి ముఖాలు మార్చి పెట్టారు. డీమన్ పవన్ , పవన్ కుమార్, మనీష్, మాస్క్ మాన్, శ్రీజ, సుమన్ శెట్టి, ఇమ్మానుయేల్, శ్రీముఖి, అభిజిత్, నవదీప్, బిందుమాధవి, ఆదిరెడ్డి, సంజన, ప్రిద్వి శెట్టి, విష్ణు ప్రియా ఇలా పాతా కొత్త బిగ్ బాస్ స్టార్స్ అందరినీ ఈ వీడియోలో చూపించారు.
ఈ వీడియో చూసిన ఆదిరెడ్డి, కిర్రాక్ సీత, గీతూ రాయల్, సుష్మ కిరణ్ వంటి వాళ్లంతా ఫన్నీ ఇలాంటి వీడియో చేశారేంటి అంటూ కామెంట్స్ పెట్టారు. ఇక చంద్రముఖి రూమ్ లో మంచం మీద రాము రాథోడ్ మంచి పడుకుని చూస్తున్నాడు అంటూ కూడా కొంతమంది ఫన్నీగా కామెంట్స్ పెట్టారు. ఈ వీడియో బిగ్ బాస్ వీకెండ్ ప్లే చేయాలి. అసలు రీతూ ఆ నవ్వులు, ఆ అరుపులు ఏంటి లాస్ట్ సీజన్ లో విష్ణు ప్రియా అలా అరిచి ట్రెండ్ సెట్ చేసినట్టు రీతూ అలా చేయాలని చూస్తోందా అంటూ కూడా కామెంట్స్ చేశారు. ఏదేమైనా ఈ సీజన్ లో సంజన, రీతూ, తనూజా కలిసి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలీకుండా పోయింది ఆడియన్స్ కి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



